MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 8:09 pm Posted by : MANA TOLIVELUGU

పూలే భవనం నిర్మించాలి

ఎల్బీనగర్ : సరూర్ నగర్ సర్వే నం.9/1Pలో 4,350 గజాల HMDA స్థలాన్ని సెప్టెంబర్ 7న వేలం వేయడాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలం వేలం వేయడం ఆపి ప్రజా అవసరాల కోసం పూలే భవనం నిర్మించాలని లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని అధ్యక్షులు గోర శ్యాంసుందర్ గౌడ్, సోషల్ జస్టిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చామకూర రాజు, రాష్ట్ర ఇంచార్జ్ కే.వీ గౌడ్, కేకే, జిట్టా ఆయిల్ రెడ్డి, కొమ్ము అంజి, భాస్కర్, రాఘవేంద్ర ముదిరాజ్, బాలస్వామి లు హెచ్చరించారు.